News March 3, 2025

నేడు పీజీఆర్‌ఎస్ రద్దు: కలెక్టర్ ప్రశాంతి

image

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు సంబంధిచిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున, ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించట్లేదని కలెక్టర్‌ ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, మండలాల్లో జరిగే గ్రీవెన్స్ రద్దు చేశామన్నారు.

Similar News

News December 3, 2025

ఏపీలో ఫిలిం టూరిజానికి మాస్టర్ ప్లాన్: మంత్రి దుర్గేష్

image

ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ప్రకటించారు. ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. విశాఖ బీచ్‌లు, గోదావరి నదీ తీరాలు, అరకు, లంబసింగి, తిరుపతి, శ్రీశైలం వంటి ప్రదేశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

News December 3, 2025

రాష్ట్రంలోనే.. రాజమహేంద్రవరానికి ఫస్ట్ ప్లేస్..!

image

రాష్ట్రంలో వాయు కాలుష్యం తక్కువ ఉన్న నగరాల్లో రాజమహేంద్రవరం ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ధూళికణాలు 2017-18లో 85 మైక్రో గ్రాములు ఉండగా.. 2024-25 నాటికి 59 మైక్రోగ్రాములకు తగ్గినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10 నగరాల్లో కాలుష్యం తగ్గిందన్నారు.