News March 3, 2025
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు: కలెక్టర్ ప్రశాంతి

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు సంబంధిచిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున, ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించట్లేదని కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, మండలాల్లో జరిగే గ్రీవెన్స్ రద్దు చేశామన్నారు.
Similar News
News March 15, 2025
రాజమండ్రి: 23 నుంచి సీపీఐ రాజకీయ ప్రచార జాత

రాజ్యాంగ పరిరక్షణ, సోషలిజం, సెక్యులరిజం, సామాజిక న్యాయమే లక్ష్యంగా మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు సీపీఐ రాజకీయ ప్రచార జాత నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. రాజమండ్రిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ వందేళ్ల చరిత్రను నాటకాల ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ క్రమంలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
News March 15, 2025
ప్లాస్టిక్ వాడకండి: నన్నయ వీసీ

పర్యావరణానికి విఘాతంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ పిలుపునిచ్చారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఆమె క్యాంపస్‌ను శుభ్రం చేశారు. అనంతరం ఇంజినీరింగ్ విద్యార్థులు నిర్వహించిన ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీలోనూ ఆమె పాల్గొన్నారు.
News March 15, 2025
తూ.గో: నేటి నుంచి ఒంటిపూట బడులు

నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నామని డీవీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం 1.15గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మిగతా పాఠశాలల్లో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకూ తరగతులు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఇది వర్తిస్తుందన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.