News January 21, 2025

నేడు పుట్టపర్తిలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు

image

పుట్టపర్తిలో నేడు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా రవాణా శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రశాంతి గ్రామంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఇందులో రహదారి భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

Similar News

News December 3, 2025

కన్నం వేసి.. రూ.8లక్షల పేలుడు పదార్థాల చోరీ

image

పెద్దవడుగూరు మండలం కోనాపురంలోని ఓ స్టోరేజ్ పాయింట్‌లో చోరీ జరిగింది. స్టోరేజ్ పాయింట్‌కు గుర్తు తెలియని వ్యక్తులు కన్నం వేసి, లోపలికి చొరబడ్డారు. సుమారు రూ.8 లక్షల విలువైన పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్టోరేజ్ పాయింట్ నిర్వాహకుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 2, 2025

ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ

image

విధులలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ MPDOకు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. PGRS గ్రీవెన్స్‌లో నిర్ణీత గడువులోగా అర్జీలను చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. చిన్న పోలమాడ పంచాయతీ కార్యదర్శి బలరామమూర్తి, హవళిగి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఉరవకొండ డిప్యూటీ MPDO సతీశ్ కుమార్‌కు నోటీసులు ఇచ్చామన్నారు.