News January 21, 2025
నేడు పుట్టపర్తిలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు

పుట్టపర్తిలో నేడు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా రవాణా శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రశాంతి గ్రామంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఇందులో రహదారి భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
Similar News
News February 12, 2025
అనంత: టెన్త్ అర్హతతో 66 ఉద్యోగాలు

అనంతపురం జిల్లా (డివిజన్)లో 66 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
అనంతపురంలో భర్త హత్య.. భార్య మరో ఇద్దరి అరెస్ట్

కాశీ అనే వ్యక్తి హత్య కేసులో అతని భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అనంతపురం రూరల్ పోలీసులు తెలిపారు. కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ నెల 2న అనంతపురం రూరల్ పరిధిలో కాశీని ఇద్దరితో కలిసి భార్యే హత్య చేసినట్టు వెల్లడైందన్నారు. నిందితులను ఆర్డీటీ స్టేడియం వద్ద అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు.
News February 12, 2025
రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా?: వైసీపీ

రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా? అని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సమీక్ష చేసే ఓపిక ప్రజాప్రతినిధులకు లేదా అని మండిపడ్డారు. వ్యాపారులు, దళారులకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని, 9 నెలలు తిరక్కుండానే రూ.1.26 లక్షల కోట్ల అప్పు చేశారని ఎద్దేవా చేశారు.