News October 14, 2024

నేడు పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం

image

భక్తుల కోర్కెలు తీర్చే పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి మొదలయ్యే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జాతర అక్టోబర్ 29న ఉయ్యాల కంబాల ఉత్సవంతో ముగుస్తుంది. రేపు సిరిమానోత్సవం జరగనుండగా 2 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పైడితల్లి జాతర నేపథ్యంలో నేడు, రేపు విజయనగరంలో మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు సీఐ మన్మథరావు తెలిపారు.

Similar News

News November 2, 2024

VZM: ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పై ఉత్కంఠ

image

విజయనగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘురాజు పై అనర్హత వేటు పడడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇందులో మెజారిటీ స్థానాల్లో వైసీపీ సభ్యులే ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీలో నిలుస్తుందో లేదో చూడాలి. కాగా అభ్యర్థులు ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

News November 2, 2024

పార్వతీపురం: గదబవలస సమీపంలో ఏనుగుల బీభత్సం

image

పార్వతీపురం మండలం గదబవలస గ్రామ సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రహదారిపై వెళ్తున్న ఆటోను ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఏనుగులు వస్తున్న సమయంలో ఆటోలో ఉన్న కార్మికులు గమనించి పరుగులు తీశారు. ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News November 2, 2024

విజయనగరం జిల్లాలో సీఎం పర్యటన రద్దు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా పర్యటన వాయిదా పడింది. గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామానికి సీఎం చంద్రబాబు శనివారం రావల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల కారణంగా పర్యటన రద్దు అయింది. ఈ విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ధ్రువీకరించారు. రాష్ట్రంలోని R&B రహదారుల పునఃనిర్మాణానికి ఇక్కడ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టాల్సి ఉండగా కార్యక్రమం వాయిదా పడింది.