News May 3, 2024

నేడు ప్రకాశం జిల్లాకు అధినేతలు

image

ఇవాళ ప్రకాశం జిల్లాకు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రానున్నారు. కూటమి అభ్యర్థులను మద్దతుగా గిద్దలూరులో ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పాల్గొంటారు. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొదిలిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం జగన్ కనిగిరిలో పర్యటించనున్నారు. దీంతో జిల్లాలో పార్టీ అధినేతలు వస్తుండటంతో అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

Similar News

News December 13, 2025

ప్రకాశం: అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల జాబితా విడుదల

image

ప్రకాశం జిల్లాలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లగా ఎంపికైన 117 మందితో జాబితా విడుదల చేశామని డీఈవో రేణుక తెలిపారు. www.prakasamschooledu.com ద్వారా జాబితా చెక్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 15వ తేదీలోగా కేటాయించిన పాఠశాలల్లో జాయిన్ కావాలని ఆదేశించారు. సంబంధిత హెచ్ఎంలు ప్రతి నెలా 2వ తేదీన డ్యూటీ సర్టిఫికేట్ సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు.

News December 13, 2025

ప్రకాశం జిల్లాలో 5.26 లక్షల సంతకాల సేకరణ

image

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి సోమవారం తరలిస్తామని దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా జిల్లాలో 5.26 లక్షల మంది సంతకాలు చేశారని చెప్పారు. వాటిని ప్రత్యేక వాహనం ద్వారా వైసీపీ ఆఫీసుకు తరలిస్తామన్నారు.

News December 13, 2025

ప్రకాశం: గ్యాస్ ఏజెన్సీలకు నోటీసులు

image

ప్రకాశం జిల్లాలోని 24 గ్యాస్ ఏజెన్సీలకు జేసీ గోపాలకృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్యాస్ డెలివరీ సమయంలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా తేలింది. ఇకపై డెలివరీ బాయ్ ప్రవర్తన, రసీదుకు మించి డబ్బులు ఎక్కువగా వసూలు చేసినా ఉపేక్షించేది లేదని జేసీ హెచ్చరించారు. మీ ఏరియాలో సిలిండర్ డెలివరీకి ఎక్కువ నగదు తీసుకుంటే ఊరిపేరు, ఏజెన్సీ పేరుతో కామెంట్ చేయండి.