News May 3, 2024
నేడు ప్రకాశం జిల్లాకు అధినేతలు

ఇవాళ ప్రకాశం జిల్లాకు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రానున్నారు. కూటమి అభ్యర్థులను మద్దతుగా గిద్దలూరులో ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొదిలిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం జగన్ కనిగిరిలో పర్యటించనున్నారు. దీంతో జిల్లాలో పార్టీ అధినేతలు వస్తుండటంతో అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
Similar News
News December 11, 2025
ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు 24వ ర్యాంకు.!

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక ఆయన 388 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 356 ఫైల్స్ క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను కేవలం 9 రోజుల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనకు CM చంద్రబాబు రాష్ట్రంలో 24వ ర్యాంకు కేటాయించారు.
News December 11, 2025
ప్రకాశం: గ్యాస్ కనెక్షన్ లేకుంటే వెంటనే లబ్ధి చేకూర్చాలి.!

ప్రకాశం జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేద కుటుంబాలకు వెంటనే గ్యాస్ కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో జేసీ బుధవారం సమావేశమయ్యారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రవర్తనపై ఐవిఆర్ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుందన్నారు. డెలివరీ సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడవద్దన్నారు.
News December 11, 2025
ప్రకాశం జిల్లాలో ప్రశాసన్ గావోంకి ఓర్ కార్యక్రమం

ప్రకాశం జిల్లాలో ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు ప్రశాసన్ గావోంకి ఓర్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై పలు కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఢిల్లీ నుంచి సంబంధిత శాఖా కార్యదర్శి రచనా సింగ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాలను అమలు చేయడం, వాటికి సంబంధించిన అంశాలపై చర్చ సాగింది.


