News October 28, 2024
నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న మంత్రి

ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా 2 రోజులు జిల్లాలో పర్యటిస్తారు. దోర్నాల క్యాంపు ఆఫీసులో జిల్లా నాయకులతో భేటీ అనంతరం ప్రాజెక్టు సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు పెండింగ్ పనులు, మార్కాపురం మండలం గొట్టిపడియ డ్యాం పరిశీలిస్తారు.
Similar News
News November 24, 2025
రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్‌కి గురై..

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్‌కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
News November 24, 2025
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.