News July 17, 2024
నేడు ప్రకాశం జిల్లా ఎస్పీగా దామోదర్ బాధ్యతలు

ప్రకాశం జిల్లాకు ఎస్పీగా నియమితులైన ఏఆర్ దామోదర్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈయన 2021 నుంచి ఇప్పటి వరకూ ఒంగోలు పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం పీటీసీ సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
Similar News
News December 28, 2025
ప్రకాశం జిల్లాకు సక్రమంగా సాగర్ జలాలు వచ్చేనా..?

ప్రకాశం జిల్లాకు నాగార్జునసాగర్ జలాల సరఫరా <<18628823>>మెరుగుపడేలా<<>> చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి జలవనరుల శాఖ అధికారులను శనివారం ఆదేశించారు. తూర్పు నాయుడుపాలెం తనక్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న జలాలు తగిన స్థాయిలో జిల్లాకు రాకపోవటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 57 TMCలు సాగర్ జలాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 34 TMCలు వచ్చాయన్నారు.
News December 28, 2025
ప్రకాశం జిల్లాకు సక్రమంగా సాగర్ జలాలు వచ్చేనా..?

ప్రకాశం జిల్లాకు నాగార్జునసాగర్ జలాల సరఫరా మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి జలవనరుల శాఖ అధికారులను శనివారం ఆదేశించారు. తూర్పు నాయుడుపాలెం తనక్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న జలాలు తగిన స్థాయిలో జిల్లాకు రాకపోవటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 57 TMCలు సాగర్ జలాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 34 TMCలు వచ్చాయన్నారు.
News December 28, 2025
తర్లుపాడు KGBV విద్యార్థులతో వంట పనులు

తర్లుపాడు మండలం కలుజువ్వులపాడు పంచాయతీలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్నట్లు ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలతో చపాతీలు చేయించడం, వంట సామాను కడిగించడం, గదులు శుభ్రంచేయించడం వంటి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. చదువు చెప్పాల్సిన సిబ్బంది పిల్లలతో చాకిరీ చేయించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


