News September 2, 2024
నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్లు

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఈ నెల 2న నిర్వహించాల్సిన ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండలాల్లో ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు అత్యవసర విధులలో ఉన్నందున రద్దు చేస్తున్నామని, మరో 48 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.
Similar News
News February 23, 2026
పాలమూరు: మత్తు వదలండి.. మైదానాలు చేరండి: మంత్రి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచాన్ని వదిలి క్రీడలపై ధ్యాస పెడితే ప్రపంచం మొత్తం తమ వైపు చూస్తుందన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
News February 23, 2026
MBNR: సౌత్ జోన్.. పీయూలో చెస్ ఎంపికలు

పీయూలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు చెస్ (పురుషుల) ఎంపికలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ జీఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. యూనివర్సిటీలో అన్ని సదుపాయాలు ఉన్నాయని, క్రీడాకారులు ప్రతిభ చాటి యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ పూస రమేశ్ బాబు, పీడీ డా.వై.శ్రీనివాసులు, కోచ్‌లు పాల్గొన్నారు. ఎంపికైన వారు మార్చి 1న నుంచి తమిళనాడులో జరిగే టోర్నీలో పాల్గొననున్నారు.
News February 22, 2026
పాలమూరు: సీఎం కప్ నెట్‌బాల్ ఫైనల్‌కు నారాయణపేట జట్టు

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న రెండో రాష్ట్రస్థాయి సీఎం కప్-2026 నెట్‌బాల్ పోటీల్లో నారాయణపేట జిల్లా బాలుర జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు డా. శెట్టి రమేశ్, డా. రామ్మోహన్ గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. రేపు జరగబోయే తుది పోరులో జట్టు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.


