News July 15, 2024
నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్

ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతి సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదివారం కోరారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీలు స్వీకరిస్తారన్నారు.
Similar News
News October 31, 2025
శిర్డీలో వేమిరెడ్డి దంపతులు

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు శిర్డీకి వెళ్లారు. బాబాను శుక్రవారం దర్శించుకున్నారు. సాయినాథుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
News October 31, 2025
కండలేరుకు నిధులు ఇవ్వాలని వినతి

కండలేరులో 11 కిలోమీటర్ల మేర కట్ట నిర్మించి 30 ఏళ్లు అవుతోంది. దీన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ తెలిపారు. డ్యాం సాధారణ మెయింటెనెన్స్కు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావుకు ఆయన వినతిపత్రం అంందజేశారు.
News October 31, 2025
నెల్లూరు జిల్లాలోని ఇళ్లపై విచారణ: మంత్రి

నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వం నాసిరకం ఇళ్లను కట్టిందని గృహనిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నెల్లూరులోని టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. ఓ కాంట్రాక్ట్ సంస్థ ఈ ఇళ్లను నిర్మించిందన్నారు. వారిపై విజిలెన్స్ విచారణ చేయిస్తామని.. నగదు రికవరీ చేయడమా? క్రిమినల్ కేసులు పెట్టడమా? అనేది త్వరలో చెబుతామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు చేస్తామన్నారు.


