News December 9, 2024
నేడు ప్రజా సమస్యల అర్జీల స్వీకరణ: తూ.గో కలెక్టర్

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం గ్రివెన్స్ డేను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశానని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 9, 2025
టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు: డీఈఓ

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించినట్లు తూ.గో డీఈఓ కంది వాసుదేవరావు తెలిపారు. రూ. 500 ఆలస్య రుసుముతో ఈ నెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు తాజాగా అవకాశం కల్పించారు. రూ. 50 రుసుముతో 12వ తేదీ వరకు, రూ. 200 ఫైన్తో 15వ తేదీ వరకు గడువు ఉంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News December 9, 2025
క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి: కలెక్టర్ కీర్తి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలోని ఎస్కెవిటి కళాశాలలో మంగళవారం సీడబ్ల్యూఎస్ఎన్ (CWSN) జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా జెండా ఊపి ఈ పోటీలను ప్రారంభించారు. ఆటల్లో విజేతలకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బహుమతులు అందజేశారు.
News December 9, 2025
ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో క్రీడల ద్వారా ప్రతిభ: కలెక్టర్

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో నమ్మకం, ధైర్యం, ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. రాజమండ్రిలోని ఎస్‌కేవీటీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కమిషనర్ ప్రారంభించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారుల్లో అపారమైన సృజనాత్మకత, ప్రత్యేక కౌశలాలు దాగి ఉన్నాయని వారు పేర్కొన్నారు.


