News August 9, 2024
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని అల్లూరి జిల్లాలో ఘనంగా జరుపుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థులు సంఘాలు, రాజకీయ సంబంధం లేకుండా వేడుకలు జరగనున్నాయి. గిరిజన సాంస్కృతిక సంప్రదాయ నృత్య వేషధారణలతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం జీవో నెంబర్3, 170 చట్టం పటిష్టంగా అమలు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పాడేరులో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Similar News
News February 8, 2026
విశాఖ: కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయని, రెవెన్యూ అధికారులతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు.
News February 8, 2026
కేజీహెచ్ జీఎన్ఎం పరీక్షలో మాస్ కాపీయింగ్.. ముగ్గురు డిబార్

విశాఖ కేజీహెచ్ అనుబంధ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న సమాచారం మేరకు కౌన్సిల్ డైరెక్టర్ సునీత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు విద్యార్థినులు కాపీ కొడుతూ పట్టుబడి డిబార్ అయినట్లు అధికారులు తెలిపారు.
News February 8, 2026
విశాఖ: వేసవికి వాటర్ టెన్షన్ లేనట్లేనా..!

విశాఖకి వచ్చే వేసవిలో నీటి కొరత ఉండదని GVMC అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నగరానికి తాగునీరు అందించే ఏలేరు, రైవాడ, మేఘాద్రి గెడ్డ, తాటిపూడి, గోస్తనీ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలతో కనీసం 6 నెలల పాటు నిరంతర నీటి సరఫరా చేయగలమన్నారు. వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగంపై పర్యవేక్షణ కొనసాగుతోందని GVMC నీటి సరఫరా అధికారి పల్లంరాజు స్పష్టం చేశారు.


