News July 20, 2024

నేడు బిక్కనూర్ మండలానికి మంత్రి జూపల్లి

image

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు బిక్కనూర్ మండలంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి చెప్పారు. మండల కేంద్రంలో నిర్వహించే రైతు సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.

Similar News

News October 19, 2025

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన NZB కలెక్టర్

image

దీపావళి పండుగను పురస్కరించుకుని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని అభిలషించారు.

News October 19, 2025

రైఫిల్ షూటింగ్లో సత్తా చాటిన ఆర్మూరు FBO సుశీల్

image

అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి క్రీడ పోటీలో ఆర్మూరు రేంజ్ FBO బాస సుశీల్ కుమార్ ప్రతిభ కనబరిచారు. సెప్టెంబర్-అక్టోబర్ నెలలో రాష్ట్ర సాయి పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బాసర జోన్ లెవెల్లో నిర్వహించిన మెన్స్ రైఫిల్ షూటింగ్లో మొదటి విజేతగా సుశీల్ నిలిచారు. అలాగే హైదరాబాదులోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఈనెల 18న రాష్ట్రస్థాయి పోటీల్లో 2వ విజేతగా నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు.

News October 19, 2025

నిజామాబాద్: 3,500 ఎకరాలల్లో ఆయిల్ పామ్ సాగు: కలెక్టర్

image

లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. కలెక్టరేట్‌లో శనివారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీని నిర్వహిస్తున్న కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగుకు తగు సూచనలు చేశారు.