News January 25, 2025

నేడు బీజేపీలోకి కరీంనగర్ మేయర్ సునీల్ రావు

image

కరీంనగర్ నగరంలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. శుక్రవారం నగర మేయర్ యాదగిరి సునీల్ రావు బీఆర్ఎస్‌కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శనివారం (నేడు) మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక SBS ఫంక్షన్ హాల్‌లో KNR ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్నట్లు మేయర్ సునీల్ రావు ప్రకటించారు. ఇక మేయర్ తో పాటు బీజేపీలో ఎవరెవరు చేరుతారు అనేది ఆసక్తిగా మారింది.

Similar News

News November 19, 2025

భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

image

భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య డిసెంబర్‌లో జరగాల్సిన సిరీస్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాతో సిరీస్‌కు తమకు పర్మిషన్ రాలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌లో ప్రత్యామ్నాయ సిరీస్‌కు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించాయి. కాగా షెడ్యూల్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది.

News November 19, 2025

HYD: కేంద్రమంత్రికి చనగాని దయాకర్ బహిరంగ లేఖ

image

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఐఐఎంలు, ఐఐటీలు, పెట్రోలియం సంస్థలతోపాటు ఇతర కేంద్రీయ విద్యా సంస్థలను తక్షణమే మంజూరు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. డిసెంబర్‌లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర అనుమతిని మంజూరు చేయించాలని అభ్యర్థించారు.

News November 19, 2025

ఈనెల 23న రాప్తాడుకు వైఎస్ జగన్

image

ఈనెల 23న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడుకు రానున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ స్థలాన్ని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మాజీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాంతో కలిసి పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు గురించి చర్చించారు.