News January 25, 2025
నేడు బీజేపీలోకి కరీంనగర్ మేయర్ సునీల్ రావు

కరీంనగర్ నగరంలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. శుక్రవారం నగర మేయర్ యాదగిరి సునీల్ రావు బీఆర్ఎస్‌కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శనివారం (నేడు) మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక SBS ఫంక్షన్ హాల్‌లో KNR ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్నట్లు మేయర్ సునీల్ రావు ప్రకటించారు. ఇక మేయర్ తో పాటు బీజేపీలో ఎవరెవరు చేరుతారు అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News February 9, 2025
NLG: ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఓట్ల వేట!

MLC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 10వ తేదీ వరకు అవకాశం ఉండగా పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ 13తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు బరిలో దిగుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నోటిఫికేషన్ ముందు నుంచే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
News February 9, 2025
మణుగూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తొగ్గూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరుకు చెందిన భూక్య కమలమ్మ(60) మరణించింది. స్థానికుల సమాచారం మేరకు.. మణుగూరు నుంచి అశ్వాపురం వెళ్తుండగా రోడ్డు దాటే క్రమంలో బుల్లెట్ బండి ఢీకొని తీవ్ర గాయాల పాలైనట్లు చెప్పారు. అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయని అన్నారు.
News February 9, 2025
MDK: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి

సిద్దిపేట జిల్లా చేగుంట, గజ్వేల్ రహదారిపై నర్సపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వేణు(48), శివమణి(15), విష్ణు ఒడి బియ్యం పోయించుకోడానికి భార్యను బస్సులో పంపి ఇద్దరు కూమారులతో బైక్‌పై వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో బైక్‌ను లారీ ఢీ కొట్టగా తండ్రి వేణు, కుమారుడు శివమణి అక్కడికక్కడే మృతి చెందారు.