News October 23, 2024

నేడు బొకారో ఎక్స్ ప్రెస్ రీ షెడ్యూల్

image

సాంకేతిక కారణాలతో నేడు అలప్పూజ – ధన్బాద్ (13352) ఎక్స్ప్రెస్ రైలు అలప్పుజాలో ఆలస్యంగా బయలుదేరుతుందని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈరోజు ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన రైలు 4 గంటలు ఆలస్యంగా ఉదయం 10 గంటలకు బయలుదేరేలా రీ షెడ్యూల్ చేశామన్నారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News November 21, 2025

ఆరుగురికి వారం రోజుల జైలు శిక్ష: VZM SP

image

మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురు నిందితులకు వారం రోజుల జైలుశిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. పెదమానాపురం, బూర్జువలస, ఎల్.కోట పోలీసు స్టేషన్ల పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నిందితులపై గజపతినగరం అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.విజయ రాజకుమార్, కొత్తవలస మెజిస్ట్రేట్ విజయచంద్ర శిక్షలను విధించారన్నారు.

News November 21, 2025

వైష్ణవ క్షేత్రాలకు విజయనగరం నుంచి ప్రత్యేక సర్వీసులు

image

మార్గశిర, ధనుర్మాసం పుణ్యదినాలు పురస్కరించుకుని ప్రయాణికులు సౌకర్యార్థం విజయనగరం ఆర్టీసీ వారు ప్రముఖ వైష్ణవ క్షేత్రాలైన ద్వారకాతిరుమల, వాడపల్లి, అంతర్వేది, అప్పన్నపల్లి, అన్నవరం దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలకు డిపోలో సంప్రదించాలని కోరారు.

News November 21, 2025

కొత్తవలస MRO అప్పలరాజు సస్పెండ్

image

కొత్తవలస MRO పి.అప్పలరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తవలస మండలంలోని చిన్నపాలెం, కింతలపాలెం, కొత్తవలస గ్రామాల్లో భూములకు సంబందించి మ్యుటేషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ PGRS ద్వారా కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ డిప్యూటీ తహశీల్దార్‌గా ఉన్న సునీతకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.