News February 24, 2025

నేడు భద్రాచలంలో గిరిజన దర్బార్‌: ITDA PO

image

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి సమస్యలకు సంబంధించిన అంశాలను లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలన్నారు. సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని పేర్కొన్నారు.

Similar News

News December 15, 2025

ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్‌కు అనర్హుడు: SC

image

ఉద్యోగి రాజీనామా చేస్తే అతని గత సర్వీసు రద్దవుతుందని, అలాంటి వారు ఫ్యామిలీ పెన్షన్‌కు అనర్హులని SC పేర్కొంది. ఉద్యోగి చేసిన రాజీనామాను ఆమోదించిన DTC PF మాత్రమే వస్తుందని, పెన్షన్ రాదని చెప్పింది. దీనిపై అతడు దావా వేయగా SC తాజా తీర్పు ఇచ్చింది. ‘VRకి పెన్షన్ వర్తిస్తుందన్నరూల్ ఉన్నా దానికి రిజైన్‌కీ తేడా ఉంది. రిజైన్‌తో పెన్షన్ రాదు’ అని పేర్కొంది. ఉద్యోగులకు ఈ తీర్పొక హెచ్చరికగా పలువురి సూచన.

News December 15, 2025

SRCL: భూ భారతి అమలుపై ఇన్‌చార్జి కలెక్టర్ సమీక్ష

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ భారతి అమలుపై ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఆమె అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి సమావేశమయ్యారు. భూ భారతి, సాదా బైనమా, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల స్థితిగతులు, ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలపై ఆరా తీశారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News December 15, 2025

బాణాసంచా కేంద్రాల్లో భద్రత తప్పనిసరి: జేసీ

image

బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిల్వ కేంద్రాల్లో సల్ఫర్, అమోనియా వంటి రసాయనాలు ఒక్కోటి 50 కేజీలకు మించి ఉండరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.