News February 24, 2025
నేడు భద్రాచలంలో గిరిజన దర్బార్: ITDA PO

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి సమస్యలకు సంబంధించిన అంశాలను లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలన్నారు. సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని పేర్కొన్నారు.
Similar News
News March 23, 2025
ప.గో: పది నెలల పాటు జైలులోనే బాల్యం..!

పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన పసల కృష్ణమూర్తి – అంజలక్ష్మి దంపతుల కుమార్తె కృష్ణ భారతి ఆదివారం మృతి చెందారు. భీమవరం సబ్ కలెక్టరేట్ వద్ద జెండా ఎగురవేసిన సందర్భంలో కృష్ణ భారతి తల్లిదండ్రులు జైలు శిక్ష అనుభవించారని గ్రామస్థులు తెలిపారు. నాడు అంజలక్ష్మి ఆరు నెలల గర్భవతి. జైలులోనే కృష్ణ భారతికి అంజలక్ష్మి జన్మనిచ్చారు. కృష్ణ భారతి బాల్యం మొదటి పది నెలలు జైలులోనే గడిపారని తెలిపారు.
News March 23, 2025
రేపు అధికారులతో మంత్రి సుభాష్ ప్రత్యేక సమావేశం

రామచంద్రపురం నియోజవర్గంలో సాగు నీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకునేందుకు ఈ నెల 24న ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం పట్టణంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఇరిగేషన్ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ (DC) అధ్యక్షులు, కార్యదర్శులు, రైతులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News March 23, 2025
దేవాదుల పంప్ హౌస్‌ను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు

హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేట గ్రామంలో గల దేవాదుల పంప్ హౌస్‌ను ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు సందర్శించి మోటార్లను పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలోనే దేవాదుల నుంచి రైతులకు నీరు అందిందని.. ఈ కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు ను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.