News April 4, 2025
నేడు భద్రాచలంలో మంత్రి తుమ్మల పర్యటన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం భద్రాచలంలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు గోదావరి కరకట్ట పరిశీలన, 10:30 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్ల పనులు పరిశీలించనున్నారు. 11:30 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 21, 2025
HYD: అర్ధరాత్రి యువతిని కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకుందామని యత్నించిన యువతి ప్రాణాలను పోలీసులు కాపాడారు. స్థానికుల వివరాలు.. రాత్రి 11:30 సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి ఓ యువతి దూకబోయింది. ఇదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు వెంకటేశ్, కృష్ణయ్య అప్రమత్తమయ్యారు. చెరువులో దూకే చివరి నిమిషంలో ఆమెను అడ్డుకొని బ్రిడ్జి మీదకు తీసుకెళ్లారు. ఆమెను రక్షించి, కౌన్సెలింగ్ ఇచ్చారు.
News April 21, 2025
రోహిత్ ఫామ్‌లో ఉంటే గేమ్ నుంచి ప్రత్యర్థి ఔట్: హార్దిక్

రోహిత్ శర్మ ఫామ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని MI కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశారు. అతను మంచి టచ్‌లోకి వస్తే ప్రత్యర్థి టీమ్ గేమ్ నుంచి ఔటైపోతుందని వ్యాఖ్యానించారు. CSKతో మ్యాచ్‌లో హిట్ మ్యాన్, సూర్య భాగస్వామ్యంతో విజయం తమవైపు వచ్చిందని చెప్పారు. తమ బౌలర్లు కూడా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారని కొనియాడారు. కాగా CSKపై రోహిత్ 76* రన్స్ చేసిన విషయం తెలిసిందే.
News April 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.