News April 6, 2025
నేడు భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి రాక

CM రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన ఖరారైంది. ఆదివారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో సారపాకలోని గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 10:30కు భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. 11:10 నుంచి 12.30 వరకు మిథిలా స్టేడియంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. 12:35కు సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి నివాసంలో భోజనం చేయనున్నారు. అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్ నుంచి HYDకు తిరుగుపయనమవుతారు.
Similar News
News February 26, 2026
TU: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఉపకులపతి

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని గురువారం వర్సిటీ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, COE ఆచార్య సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాంబాబుతో కలిసి తనిఖీ చేశారు. ఉపకులపతి అధికారులకు తగిన సూచనలు చేస్తూ, పరీక్షలను సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
News February 26, 2026
యుసీఈకే ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ కే.పద్మరాజు

యుసీఈకే ప్రిన్సిపల్‌గా ప్రొఫెసర్ కె.పద్మరాజును నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన డాక్టర్ ఎన్.మోహనరావును బాధ్యతల నుంచి రిలీవ్ చేసినట్లు యూనివర్సిటీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. నూతన ప్రిన్సిపల్‌గా పద్మరాజు వెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. అపార అనుభవం ఉన్న ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
News February 26, 2026
HNK: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, HNK క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి మొదలైంది. 3వ తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. మార్చి 13 నుంచి 17 వరకు మండల, 28 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లా, 27 నుంచి మే1 వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయి. నేటి నుంచి మార్చి 4వ తేదీలోగా https:///tgss.telangana.gov.inలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చని క్రీడల అధికారి అశోక్ తెలిపారు.


