News February 22, 2025
నేడు భైంసాకు BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాక

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు భైంసాకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రానున్నారని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలియజేశారు. సాయంత్రం 4గంటలకు SSజిన్నింగ్ ఫ్యాక్టరీలో నియోజకవర్గ కార్యకర్తలు, పట్టభద్రుల ఓటర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గోడం నగేష్‌తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు.
Similar News
News February 28, 2026
అక్రమ గల్ఫ్ ఏజెంట్లపై కడప ఎస్పీ కొరడా

మహిళలను టూరిస్ట్ వీసాలపై గల్ఫ్ పంపి మోసగిస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నచికేత్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలు కేవలం రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలి అన్నారు. గల్ఫ్‌లో ఇబ్బంది పడుతున్నవారు ‘Madad’ పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. దళారుల సమాచారం తెలిస్తే 9121100504, 9121100652 నంబర్లకు తెలపాలన్నారు.
News February 28, 2026
AI ఫియర్.. ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు!

ఏఐ విప్లవం ఐటీ ఉద్యోగులను భయపెడుతున్నా కొన్ని వృత్తులు మాత్రం అత్యంత సురక్షితమని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్ వంటి శారీరక నైపుణ్యం ఉన్నవారిని ఏఐ భర్తీ చేయలేదు. అలాగే డాక్టర్లు, నర్సులు, టీచర్లు, చెఫ్, వ్యవసాయం వంటి వృత్తులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. చేతులతో చేసే పని, మనుషులతో జరిపే సంభాషణ ఉన్నంత కాలం ఈ ఉద్యోగాలకు ఢోకా ఉండదని సూచిస్తున్నారు.
News February 28, 2026
గూడూరు: శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సూసైడ్.. కారణం ఇదే!

గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన బూదురు సునీల్ కుమార్ <<19259093>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. పొదలకూరులోని శ్రీచైతన్య స్కూల్లో ఆయన ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఏమైందో ఏమో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా చావుకు శ్రీచైతన్య స్కూల్ ఏజీఎం నర్ర శ్రీకాంత్ వేధింపులే కారణం. నా పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్ చదివించాలన్నదే నా చివరి కోరిక’ అంటూ ఆయన సూసైడ్ లెటర్ రాశారు.


