News May 10, 2024

నేడు మంగళగిరికి సీఎం జగన్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ శుక్రవారం మంగళగిరికి రానున్నారు. ఉదయం 10:30 గంటలకు స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్లో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ ప్రదేశాన్ని ఎమ్మెల్యే ఆర్కే, పోలీస్‌ ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. హెలిప్యాడ్‌ స్థలం కోసం నిడమర్రు రోడ్డు, రైలుగేటు వద్ద గల స్థలాలను పరిశీలించారు.

Similar News

News April 22, 2025

తుళ్లూరు: అక్కను హత్య చేసిన తమ్ముడికి యావజ్జీవ శిక్ష

image

తుళ్లూరు మండలం కొత్తూరు గ్రామంలో 2017లో జరిగిన ఆస్తి తగాదా హత్య కేసులో సోమవారం న్యాయస్థానం శిక్ష విధించింది. అక్కను హత్య చేసి, ఆమె కూతురిపై దాడి చేసిన షేక్ నాగుల్ మీరావాలికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.1000 జరిమానా, మరోసారి 307 సెక్షన్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు విచారణ చేసిన తుళ్లూరు మాజీ సీఐ సుధాకరరావు నేతృత్వంలోని బృందాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు.

News April 22, 2025

తొలి పునరుత్పాదక ఇంధన రాజధానిగా అమరావతి

image

అమరావతిని ప్రపంచంలో తొలి పునరుత్పాదక ఇంధన రాజధానిగా అభివృద్ధి చేయాలన్న దిశగా చర్యలు వేగవంతం చేశారు. 2050 నాటికి 2,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రభుత్వం నిర్మించే ఇళ్లలో 1/3 పైకప్పు సోలార్ ప్యానెల్లకు కేటాయించనున్నారు. ప్రభుత్వ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు సోలార్ తప్పనిసరి. ఇప్పటికే 415 కిలోవాట్ల సోలార్ ప్యానెల్లు 16 కేంద్రాల్లో ఏర్పాటు అయ్యాయి.

News April 22, 2025

దొంగల కదలికల భయంతో నిద్రలేని గ్రామం

image

పెదనందిపాడు మండలానికి చెందిన పరిటలవారిపాలెం గ్రామంలో రెండు రోజులుగా దొంగల కదలికలతో గ్రామస్థులు భయంతో గడుపుతున్నారు. రాత్రివేళల్లో ఇంట్లోకి చొరబడి దొంగిలించేందుకు దొంగలు ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడానికి గ్రామస్థులు కర్రలు పట్టుకుని రాత్రి వేళ కాపలా కాశారు. పోలీసుల గ్రామానికి భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.

error: Content is protected !!