News January 31, 2025
నేడు మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్: DEO

పదో తరగతి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ మండల స్థాయి పరీక్షలు ఈనెల 31న ఎమ్మార్సీ కార్యాలయంలో నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరు కావాలని చెప్పారు. ప్రతి మండలం నుంచి ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయాలని పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
భూపాలపల్లి: మొదటి రోజు అంతంత మాత్రంగానే నామినేషన్లు

జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్లు మొదటి రోజు (ఆదివారం) అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. సర్పంచ్లకు భూపాలపల్లిలో 3, చిట్యాలలో 20, టేకుమట్లలో 16, పలిమెలలో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే వార్డులకు భూపాలపల్లిలో 1, చిట్యాలలో 19, టేకుమట్లలో 4, పలిమెలలో 4 నామినేషన్లు దాఖలయ్యాయి.
News December 1, 2025
ఇవాళ సమంత పెళ్లి అంటూ ప్రచారం

హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూమర్డ్ బాయ్ఫ్రెండ్ రాజ్ నిడిమోరును ఆమె ఇవాళ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో పెళ్లి చేసుకుంటారని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు సమంత, రాజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. కాగా ‘తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు’ అని రాజ్ మాజీ భార్య శ్యామలిదే చేసిన పోస్ట్ ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.
News December 1, 2025
MHBD: నేటి నుంచి కొత్త వైన్ షాపుల ప్రారంభం

జిల్లాలో 2025-27 లైసెన్స్ పీరియడ్ కోసం మొత్తం 61 వైన్ షాపులకు డ్రా పద్ధతి ద్వారా అధికారులు లైసెన్సులు కేటాయించారు. ఇందులో మహబూబాబాద్-27, తొర్రూర్-22, గూడూరు-12 ఎక్సైజ్ శాఖ పరిధిలో 61 షాపులు నిర్వహిస్తున్నారు. డ్రాలో ఎంపికైన నూతన నిర్వాహకులకు అధికారులు లైసెన్సులు అందజేయడంతో వారు సోమవారం నుండి కార్యకలాపాలను ప్రారంభించనున్నారు.


