News June 24, 2024

నేడు మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతల స్వీకరణ

image

రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 7.50ని.లకు రాష్ట్ర సచివాలయంలో బ్లాక్ నెంబర్ 3, రూమ్ నెంబర్ 207లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులకు రవీంద్ర ప్రత్యేక ఆహ్వానాలు పంపారు.

Similar News

News November 14, 2024

అధికారులపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఆగ్రహం

image

ఉపాధి హామీ, జల్‌జీవన్ మిషన్ కింద జిల్లాలో చేపట్టిన పనులకు నిధుల కొరత లేకున్నా పనులు గ్రౌండింగ్‌లో ఉండటంతో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో సంబంధిత శాఖాధికారులతో సమావేశమై పలు పనుల పురోగతిని సమీక్షించారు. పూర్తి స్థాయిలో పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 13, 2024

గన్నవరంలో బాలికపై అత్యాచారం

image

గన్నవరంలో ఓ బాలికపై కొన్నాళ్లుగా అదే ఊరికి చెందిన ప్రశాంత్ అలియాస్ బన్ను అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. బాలికకు కడుపునొప్పి రాగా తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకువెళ్లడంలో గర్భవతిగా వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.  

News November 13, 2024

60 ఏళ్ల వయస్సులో బంగారు పతకాల పంట

image

కృష్ణా జిల్లా పెడనకు చెందిన భీమేశ్వరరావు(60) జగ్గయ్యపేటలో 10వ తారీఖున జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో 3 బంగారు పథకాలు సాధించారు. దీంతో ఈ వయసులో కూడా అతని ఫిట్నెస్ చూసి జనం ఆశ్చర్యపోయారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే భీమేశ్వరరావు పాల్గొన్న ప్రతి పోటీల్లో పతకం సాధించడం విశేషం. ఇప్పటి వరకు జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో 14 పతకాలను గెలిచాడు. ఈ ఘనతకు కారణం కోచ్ సుబ్రహ్మణ్యం అని చెప్పారు.