News April 5, 2025
నేడు మంథని నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సు

శ్రీ రామనవమి కళ్యాణోత్సం కోసం మంథని నుంచి భద్రాచలం వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు మంథని డీఎం శ్రావణ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి, ఆదివారం కళ్యాణోత్సవం తర్వాత సాయంత్రం 4 గంటలకు తిరిగి మంథనికి బయలు దేరుతుందని పేర్కొన్నారు. ఫుల్ టికెట్ రూ.450, హాఫ్ టికెట్ రూ.225, మహిళలకు ఉచిత పథకం ఉందని తెలిపారు.
Similar News
News April 6, 2025
HYD: శోభాయాత్ర.. ఈ రూట్‌లు బంద్!

శ్రీ రామనవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని HYD పోలీసులు తెలిపారు. సౌత్ వెస్ట్ జోన్‌లో 9AM నుంచి 4PM వరకు, ఈస్ట్ జోన్‌లో 2PM నుంచి 9PM వరకు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. 20 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, MJ మార్కెట్, పుత్లీబౌలి మీదుగా సుల్తాన్‌బజార్‌కు ర్యాలీగా వెళ్తారు. ప్రత్యామ్నాయ రూట్‌లో వెళ్లాలని పోలీసులు సూచించారు.SHARE IT
News April 6, 2025
భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
News April 6, 2025
పెనమలూరు: కలకలం రేపిన మహిళ అనుమానాస్పద మృతి

యనమలకుదురు లంకలలో ఓ మహిళ మృతదేహం కనపడటం కలకలం రేపింది. శనివారం ఉదయం ముళ్లకంపల్లో గులాబీ చీర, జాకెట్‌లో ఆమె శవమై కనిపించింది. కళ్లు, ముక్కు, నోటి నుంచి రక్తస్రావం, మోచేతికి పచ్చబొట్టు ఉండటంతో అనుమానాలు పెరిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్‌తో విచారణ ప్రారంభించారు. ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వస్తున్నాయి.