News February 22, 2025
నేడు మల్లన్నకు టీటీడీ దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా నేటి శనివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అలాగే ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం(కాణిపాకం) శ్రీ స్వామి అమ్మ వార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శాస్త్రోక్తంగాపట్టు వస్త్రాలను ఆయా దేవస్థానాల ఈవోలు, అధికారులు, అర్చకులు సమర్పించనున్నారు.
Similar News
News December 4, 2025
WGL: తొలి విడత బరిలో 10,901 అభ్యర్థులు

ఉమ్మడి జిల్లాలో తొలివిడత 555 సర్పంచ్ స్థానాలకు 1,817, 4,952 వార్డు స్థానాలకు 9,084 నామినేషన్లు దాఖలయ్యాయి. WGLలో 91 GPలకు 305, 800 వార్డులకు 1427 నామినేషన్లు వచ్చాయి. HNKలో 69 GPలకు 264, 658 వార్డులకు 1339, JNలో 110 GPలకు సర్పంచ్ 340, 1024 వార్డులకు 1893, MHBDలో 155 GPలకు 468, 1338వార్డులకు 2391, ములుగులో 48 GPలకు178, 420 వార్డులకు 557, BHPLలో 82 GPలకు 262, 712 వార్డులకు 1,477 నామినేషన్లు పడ్డాయి.
News December 4, 2025
GNT: మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు నివాళి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వర్ధంతి నేడు. ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరులో 1933 జులై 4న జన్మించారు. ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో ఏకంగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో ‘అజాతశత్రువు’గా, మచ్చలేని నేతగా, గొప్ప పరిపాలకుడిగా ఆయనకు మంచి పేరుంది.
News December 4, 2025
పూజల్లో అరటి పండు ప్రాధాన్యత

పూజలు, వ్రతాలు, శుభకార్యాల్లో అరటికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఇతర పండ్లలాగా దీనికి ఎంగిలి ఉండదు. అదెలా అంటారా? దాదాపు అన్ని చెట్లు వాటి గింజల నుంచి మొలుస్తాయి. ఆ గింజలను మనం ఎంగిలిగా భావిస్తాం. కానీ, అరటి అలా కాదు. ఇది మొక్కల ద్వారానే వృద్ధి చెందుతుంది. అందుకే దీన్ని పూర్ణఫలంగా, పవిత్రమైనదిగా దేవుడికి నివేదిస్తారు. పండ్లను, ఆకులను.. ఇలా ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని పూజకు వాడుతారు.


