News February 24, 2025

నేడు మహబూబాబాద్‌లో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత

image

మహబూబాబాద్‌లో నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ఉదయం 9:30గం.కు డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లిలో నెట్ సెంటర్ ప్రారంభిస్తారు. 10:00 గం.కు మరిపెడలోని జాగృతి నాయకురాలు మాధవి గృహప్రవేశంలో పాల్గొని, 11:00 గం.కు కురవి వీరభద్రస్వామి ఆలయంలో పూజ చేస్తారు. మ.12:00 గంటలకు మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొంటారు.

Similar News

News February 24, 2025

పార్వతీపురం: ‘పీ-4 సర్వేని పక్కాగా చేపట్టాలి’

image

జిల్లాలో పీ-4 విధానంపై (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్ షిప్) సర్వేను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. మార్చి 8 నుంచి 28వ తేదీ వరకు సర్వే చేయాలని సూచించారు. జిల్లాలో 2,65,000 గృహాలు ఉన్నాయని, వ్యవధి తక్కువగా ఉన్నందున ప్రణాళికబద్దంగా సర్వే పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

News February 24, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ: NZ టార్గెట్ ఎంతంటే?

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 236/9 స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ శాంటో (77), జాకిర్ అలీ (45) రాణించారు. NZ బౌలర్లలో బ్రేస్‌వెల్ 4 వికెట్లు పడగొట్టగా, రూర్కీ 2, హెన్రీ, జెమీసన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే బంగ్లాదేశ్‌తో పాటు పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.

News February 24, 2025

ఆసిఫాబాద్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

శివరాత్రి రోజున నిర్వహించే జాతరకు ఆసిఫాబాద్ డిపో నుంచి 28 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ విశ్వనాథ్ తెలిపారు. వాంకిడి జాతరకు ఆసిఫాబాద్ నుంచి 3 బస్సులు, కాగజ్ నగర్ నుంచి ఈస్గామ్ 6, బెల్లంపల్లి నుంచి బుగ్గకు 15, ఆసిఫాబాద్ నుంచి నంబాలకు 4 బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!