News January 28, 2025

నేడు మహబూబాబాద్‌లో మెగా జాబ్ మేళా

image

సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఏటూరునాగారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని సోమవారం డిప్యూటీ డైరెక్టర్ గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కావున, ఆసక్తిగా ఉన్న గిరిజన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాను మంగళవారం ఉ.10కు మహబూబాబాద్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తామన్నారు.

Similar News

News October 30, 2025

జనగామ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

రైల్వే అధికారులు సికింద్రాబాద్ నుంచి జనగామ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న శాతవాహన ఎక్స్ ప్రెస్ (12713-12714) నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైలు ఇకనుంచి జనగామ స్టేషన్‌లో ఆగుతుందని SCR స్పష్టం చేసింది. ఈ నెల 30 నుంచి ఈ హాల్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

News October 30, 2025

నేడే కీలక పోరు.. భారత్ గెలిచేనా?

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇవాళ భారత్, ఆస్ట్రేలియా మధ్య మ.3 గంటల నుంచి సెమీ ఫైనల్-2 జరగనుంది. బలమైన AUSను ఎలాగైనా ఓడించాలని IND భావిస్తోంది. షఫాలీ వర్మ రాకతో టాపార్డర్ స్ట్రాంగ్‌గా మారనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నవంబర్ 2న సౌతాఫ్రికాతో ఫైనల్‌లో తలపడనుంది. ODI WCలలో ఇప్పటివరకు IND, AUS 14 మ్యాచుల్లో తలపడగా IND మూడింట్లో మాత్రమే గెలిచింది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

News October 30, 2025

యూట్యూబ్‌ వీడియోలు ఇకపై మరింత స్పష్టంగా!

image

యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లోని LOW రిజల్యూషన్ వీడియోల విజ్యువల్ క్లారిటీని AI సాయంతో మెరుగుపరచనుంది. ఇందుకోసం ‘అప్‌స్కేలింగ్’ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. 1080P కంటే తక్కువ రిజల్యూషన్‌లో అప్‌లోడ్ అయిన వీడియోలను దీని సాయంతో ఇంప్రూవ్ చేస్తారు. ఫ్యూచర్‌లో 4K క్వాలిటీ కంటే బెటర్‌గా కూడా చేయొచ్చని సంస్థ వర్గాలు పేర్కొన్నారు. దీని వల్ల TVలు, వెబ్, మొబైల్ డివైజ్‌లలో వీడియోలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.