News November 25, 2024
నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్

నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్ రానున్నారు. లగచర్ల ఘటనను నిరసిస్తూ పట్టణంలో పార్టీ నాయకులతో కలిసి మహాధర్నా చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. కాగా, ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొననున్నారు.
Similar News
News December 3, 2025
వంజరపల్లిలో సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ!

సంగెం మండలం వంజరపల్లిలో ఎస్టీ జనాభా లేకపోవడంతో సర్పంచ్, 1,4,6 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఎస్టీ జనాభా లేని గ్రామానికి ఈ పదవులు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లింది. నామినేషన్ గడువు ముగిసే సమయానికి 5 వార్డులకు మాత్రమే నామినేషన్లు రావడంతో, ఉప సర్పంచ్గానే గ్రామ పాలన నడిచే పరిస్థితి.
News December 1, 2025
గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సత్య శారద సమీక్ష

వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డ్ మెంబర్ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నియమించిన నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు నోడల్ అధికారులు మరింత శ్రద్ధ వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
News December 1, 2025
ఎయిడ్స్పై అవగాహన అత్యంత అవసరం: కలెక్టర్

వరల్డ్ ఎయిడ్స్ డే-2025 సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్పై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని, ముందస్తు జాగ్రత్తలు, సరైన సమాచారంతోనే వ్యాధిని నిరోధించగలమని పేర్కొన్నారు.


