News January 30, 2025
నేడు మహబూబ్ నగర్‌లో బీఆర్ఎస్ నిరసన

మహబూబ్‌నగర్ క్లాక్ టవర్ చౌరస్తాలో నేడు గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వ అసమర్ధ పాలనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ముందుగా మహాత్మా గాంధీకి నివాళులర్పించి.. అనంతరం నిరసన కార్యక్రమాన్ని చేపడతామన్నారు.
Similar News
News December 5, 2025
బాలానగర్: ఉద్యోగాన్ని వదిలి.. సర్పంచి బరిలో..!

బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లికి చెందిన అంగన్వాడీ కార్యకర్త గాయత్రి ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేశారు. పెద్దాయపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో పోటీ చేసేందుకు గురువారం స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఈమె భర్త లక్ష్మయ్య గతంలో పెద్దాయపల్లి ఎంపీటీసీగా పనిచేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నడంతో హాట్ టాపిక్‌గా మారింది.
News December 5, 2025
నవాబుపేటలో 17.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులతో పోలిస్తే.. చలి తీవ్రత కాస్త తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగాయి. నవాబుపేటలో 17.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 18.4, రాజాపూర్ 18.7, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ మండలం దోనూరు 18.9, మహమ్మదాబాద్, హన్వాడ 19.5, జడ్చర్ల 20.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News December 5, 2025
MBNR: సీఎంకు కాంగ్రెస్ కార్యకర్త లేఖ..మూడు ముక్కలైందంటూ ఆవేదన

సీఎం సార్ కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలైందని, గ్రామంలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత BRS పార్టీ నుంచి వచ్చిన వాళ్లకే వార్డు అభ్యర్థులను కేటాయించారని MBNR(D) గండీడ్(M) పెద్దవార్వాల్‌కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లెటర్ వైరల్ అయింది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశామని, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీని కాపాడాలన్నారు.


