News November 26, 2024
నేడు మాగుంట సుబ్బరామరెడ్డి 77వ జన్మదినం
ప్రకాశం జిల్లాలో తమకంటూ ఓ ముద్ర వేసుకున్న వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి. నేడు ఆయన 77వ జన్మదినం. ఒంగోలు MPగా ఆయన పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, ఆలయ నిర్మాణాలు, కళాశాలల నిర్మాణాలు వంటి ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికీ ఆయనను గుర్తు చేస్తూనే ఉంటాయి. అయితే డిసెంబరు 1, 1995(PWG) నక్సలైట్ల దాడిలో ఆయన మృతి చెందారు. సతీమణి పార్వతమ్మ ఒంగోలు MP, MLAగా పనిచేశారు. సోదరుడు శ్రీనివాసులరెడ్డి ప్రస్తుత MPగా ఉన్నారు.
Similar News
News December 7, 2024
ధర్మవరపు సుబ్రహ్మణ్యం అద్దంకి నియోజకవర్గానికి చెందిన వారే
తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. నేడు ఆయన వర్ధంతి. బల్లికురవ మండలం, కొమ్మినేనివారిపాలెంలో 1954లో జన్మించిన ఆయన అనారోగ్య కారణంగా 2013, డిసెంబర్ 7న మరణించారు. ఆయన ప్రాథమిక విద్యను తన స్వగ్రామంలో, 6 నుంచి 10వ తరగతి వరకు అద్దంకిలో చదివారు. ఒంగోలు CSR శర్మ కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసించారు.
News December 7, 2024
ప్రకాశం: రెవెన్యూ సదస్సులో 640 అర్జీలు
జిల్లా వ్యాప్తంగా తొలిరోజు శుక్రవారం నిర్వహించిన “రెవెన్యూ సదస్సు”లలో 640 అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. వీటిలో ఒంగోలు డివిజన్లో 273, కనిగిరిలో 230, మార్కాపురంలో 137 వచ్చాయన్నారు. ఈ మొత్తం అర్జీలు 35 రకాల సమస్యలకు సంబంధించినవని ఆమె శుక్రవారం తెలిపారు. మొత్తం అర్జీలలో నాలుగింటిని అప్పటికప్పుడే పరిష్కరించామన్నారు. ప్రజలు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 7, 2024
ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన అంబేద్కర్
ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత అంబేద్కర్ కే దక్కుతుందని ఎస్పీ దామోదర్ చెప్పారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అణగారిన బలహీన వర్గాల అభ్యుదయం కోసం, కుల నిర్మూలన కోసం అంబేద్కర్ ఎంతగానో పాటుపడ్డారన్నారు