News August 24, 2024
నేడు మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి నీటి విడుదల

రాజరాజేశ్వర జలాశయం(మిడ్ మానేరు) నుంచి శనివారం దిగువన ఎల్ఎండీకి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయానికి ఎల్లంపల్లి నుంచి 6,300, మానేరు, మూలవాగు నుంచి 110 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి కుడి కాలువ, అన్నపూర్ణ జలాశయానికి నీటి తరలింపును నిలిపివేశారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.78 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Similar News
News December 10, 2025
KNR: తొలి విడత జీపీ పోలింగ్కు సర్వం సిద్ధం

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు మండలాల్లో డిసెంబర్ 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. 92 పంచాయతీల పరిధిలోని 866 పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాల మోహరింపు, వెబ్కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. సున్నిత కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ వెల్లడించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధం. నిషేధాజ్ఞలు కొనసాగుతాయన్నారు.
News December 10, 2025
కరీంనగర్: ఎన్నికల కోసం పోలీస్ సిబ్బంది కేటాయింపు

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 782 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఇందులో ఆరుగురు ఏసీపీలు, 19 మంది ఇన్స్పెక్టర్లు, 40 మంది SIలు, 34మంది హెడ్ కానిస్టేబుల్స్, 392మంది కానిస్టేబుళ్ళు, 47మంది స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 144 హోంగార్డ్స్, 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులని ఆయన తెలిపారు. పోలింగ్ బందోబస్తు చేసే పోలీసులకు దిశా నిర్దేశం చేశారు.
News December 10, 2025
జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి ధర

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,450 పలకగా.. బుధవారం రూ.50 తగ్గి రూ.7,400 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. బుధవారం మార్కెట్కు రైతులు 62 వాహనాల్లో 446 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్లో కొనుగోళ్లను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.


