News October 13, 2024

నేడు మీ కోసం కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులు విధులలో ఉన్నందున ఈ నెల14వ తేదీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సృజన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ చెప్పారు.

Similar News

News October 23, 2025

కృష్ణా: నేడు జిమ్నాస్టిక్స్ జట్ల ఎంపిక

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-14, 17 బాల బాలికల జిమ్నాస్టిక్స్ జట్ల ఎంపికలు నేడు జరగనున్నాయి. విజయవాడలోని సిద్దార్థ పాఠశాల ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 3 గంటలకు ఎంపికలు మొదలవుతాయి. క్రీడాకారులు స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, హెచ్‌ఎం సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తప్పనిసరిగా తీసుకురావాలని కార్యదర్శి దుర్గారావు తెలిపారు.

News October 22, 2025

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – కలెక్టర్

image

జిల్లాలో నెలకొన్న పలు రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో అర్హత గల లబ్ధిదారులను గుర్తించాలన్నారు.

News October 22, 2025

MTM : ప్రారంభమైన కార్తీక మాసం.. సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు

image

కార్తీక మాసం సందర్భంగా సముద్ర పుణ్య స్నానాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక మాసం నెల రోజులపాటు సముద్రంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున లక్షలాది మంది సముద్ర స్నానాలు ఆచరిస్తారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంకు సమీపంలో ఉన్న మంగినపూడి బీచ్ నెల రోజుల పాటు భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు బీచ్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.