News September 27, 2024

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఇదే..

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉండవల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరి 12 గంటలకు వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా ఐటీ పాలసీపై సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం మున్సిపల్ శాఖపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 6:30 గంటలకు విజయవాడలో జరిగే వరల్డ్ టూరిజం డే కార్యక్రమంలో పాల్గొంటారు.

Similar News

News October 7, 2024

గుంటూరులో త్వరలో ఫుడ్ కోర్టులు.?

image

గుంటూరులో త్వరలో ఫుడ్ కోర్టులు ఏర్పాటుకు GMC అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రాత్రి 10 గంటల తర్వాత భోజనం, టిఫిన్, హోటల్‌లు అందుబాటులో ఉండకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 2 గంటల వరకు ఆహార ప్రియులు కోరుకున్న పదార్థాలు ఒకే చోట లభ్యమయ్యేలా ఏర్పాటు చేయనున్నారు. 4ఏళ్ల కిందట ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసినా కరోనాతో అవి కనుమరుగయ్యాయి.

News October 7, 2024

కొల్లూరు: కృష్ణానదిలో యువకుడి గల్లంతు

image

కృష్ణా నది తీరానికి వచ్చిన ఓ యువకుడు నదిలో మునిగి గల్లంతైన ఘటన ఆదివారం కొల్లూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు.. తెనాలి బీసీ కాలనీకి చెందిన నరేశ్(20)మరో ఆరుగురు నది తీరానికి వచ్చి ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో నీటి ప్రవాహానికి బాల్ కొద్ది దూరం కొట్టుకొని వెళ్లడంతో తీసుకొచ్చేందుకు వెళ్లిన నరేశ్ కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News October 6, 2024

గుంటూరు: చదివింది ఇంజినీరింగ్.. చేసేది చోరీలు

image

మెకానికల్ ఇంజినీరింగ్ చదివి చెడు వ్యసనాలకు బానిసగా మారి చోరీలు చేస్తున్న యువకుడిని పట్టాభిపురం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్టేషన్ ఎస్.హెచ్.ఓ వీరేంద్రబాబు మాట్లాడుతూ.. గొర్రెల చినబాబు అనే యువకుడు ఎస్వీఎన్ కాలనీలో జరిగిన చోరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడని‌, గతంలో ఇతనిపై అనేక కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. నిందితుడి నుంచి రూ.10 లక్షలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.