News April 12, 2025

నేడు యథావిధిగా కొనసాగనున్న రిజిస్ట్రేషన్లు

image

నేడు రెండో శనివారం సెలవు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా యథావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రిజిస్ట్రేషన్లు  చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Similar News

News December 16, 2025

ఈనెల 19న ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌ డే: కలెక్టర్‌

image

ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌ డే కార్యక్రమాన్ని ఈనెల 19న మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతినెలా మూడో శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌ డేను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News December 16, 2025

నెల్లూరులో మరో లేడీ డాన్.. ఇకపై వివరాలు చెబితే ప్రైజ్ .!

image

నెల్లూరులో పదేళ్లుగా గంజాయి అమ్ముతున్న షేక్ ముంతాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు DSP ఘట్టమనేని తెలిపారు. స్థానికుల సమాచారంతో దాడులు చేయగా నిందితురాలి ఇంటిలో 20.90కిలోల గంజాయి లభ్యం అయిందన్నారు. దీంతో ఆమెతోపాటు కుమారులు సిరాజ్, జమీర్, కోడలు సుభాషిణితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. యువత ఇలాగే సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటూ నగదు రివార్డ్ ఇస్తామని DSP పేర్కొన్నారు.

News December 16, 2025

నెల్లూరు జిల్లాకు TDP కొత్త బాస్ ఈయనే.!

image

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర యాదవ్ పేరు ఖరారైంది. కాగా అధికారిక ప్రకటన విడుదల కావల్సి ఉంది. ప్రస్తుతం రవిచంద్ర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాయలసీమ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. గతంలోనూ ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.