News March 10, 2025
నేడు యాదగిరిగుట్టకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఉదయం 11గంటలకు ఆయన ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగమైన పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు.
Similar News
News December 14, 2025
కరీంనగర్ జిల్లాలో 84.63% పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 84.63% పోలింగ్ కాగా, చిగురుమామిడిలో 85.82%. గన్నేరువరంలో 88.55%, మానకొండూరులో 82.34%, శంకరపట్నంలో 84.98%, తిమ్మాపూర్ లో 84.83% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 185003 ఓట్లకు గాను 156568 ఓట్లు పోలయ్యాయి.
News December 14, 2025
గద్వాల: నాలుగు మండలాల్లో 95,592 ఓట్లు నమోదు

గద్వాల జిల్లాలో 2వ విడతలో ఎన్నికలు జరిగిన 4 మండలాల్లో 1,12,087 మంది ఓటర్లు ఉండగా 95,592 మంది ఓటు వేశారు. అయిజ మండలంలో 39,377 మంది ఓటర్లకు 32,563 మంది, మల్దకల్ మండలంలో 37,915 మంది ఓటర్లకు 30,548 మంది, వడ్డేపల్లి మండలంలో 7,477 మంది ఓటర్లు ఉండగా 6,442 మంది, రాజోలి మండలంలో 28,038 మంది ఓటర్లకు 23,039 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News December 14, 2025
కోడ్ ముగిసే వరకు ర్యాలీలు నిషేధం

ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. రెండో విడత ఎన్నికలు పూర్తయిన సందర్భంగా కౌంటింగ్ అనంతరం విజేత ర్యాలీలు నిషేధం అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని అన్నారు.


