News March 10, 2025

నేడు యాదగిరిగుట్టకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఉదయం 11గంటలకు ఆయన ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగమైన పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు.

Similar News

News March 15, 2026

రేపటి ప్రజావాణి రద్దు: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భారత జనాభా గణన–2025 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని తహశీల్దారులు, ఎంపీడీవోల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్న కారణంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News March 15, 2026

వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం

image

కొడంగల్ మండలం రావులపల్లికి చెందిన రామ్ రెడ్డి (62) ప్రమాదవశాత్తు ఒంటికి నిప్పంటుకొని మృతి చెందాడు. ఆదివారం పొలం గట్టుపై ఉన్న వ్యర్థాలను తొలగించేందుకు నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వాటిని నియంత్రించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గుండెపోటుకు గురై అదే మంటల్లో పడి మృతి చెందినట్లు బంధువులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 15, 2026

గోదావరిఖని: సింగరేణి అధికారుల సమ్మె హెచ్చరిక

image

సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేపు యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు అధికారుల సంఘం ప్రకటించింది. ఇల్లందు క్లబ్లో జరిగిన సమావేశంలో ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్మిపతి గౌడ్, జనరల్ సెక్రటరీ పెద్ది నర్సింహులు మాట్లాడుతూ.. పీఆర్పీ బకాయిలు, పే అప్‌గ్రేడేషన్, పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తీర్చకపోతే మార్చి 31 లోపు ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.