News March 10, 2025
నేడు యాదాద్రికి రానున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సోమవారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి విచ్చేసి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో జిష్ణుదేవ్ వర్మ పాల్గొంటారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.
Similar News
News December 12, 2025
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు
News December 12, 2025
ప్రభుత్వ ఫార్మా బలోపేతానికి చర్యలేంటి?: ఎంపీ

దేశంలో ఫార్మా పీఎస్యూ (పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్) రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ప్రస్తుత పీఎస్యూల ఆధునికీకరణ ప్రణాళికలేంటో లోక్సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. దీనికిగాను కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
News December 12, 2025
వికారాబాద్: ముగిసిన రెండో విడత ప్రచారాలు

రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారాలు ఈరోజు సాయంత్రం 5 గంటలతో నిలిపి వేయాలని కలెక్టర్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్లో ఆయన ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. వికారాబాద్ జిల్లాలోని ఏడు మండలాల్లో ఈనెల 14న ఎన్నికలు నిర్వహించనున్నారు.


