News December 4, 2024
నేడు రాజకీయ ఘనపాటి కొణిజేటి రోశయ్య వర్ధంతి

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ సీఎం, రాజకీయ ఘనపాటి కొణిజేటి రోశయ్య మరణించి నేటికీ 3 ఏళ్లు పూర్తయ్యాయి. చీరాల MLAగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రోశయ్య అసెంబ్లీలో వరుసగా 7సార్లు, మొత్తం 15 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డ్ సృష్టించారు. ఆయన తమిళనాడు కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా సేవలను అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఆయన ఒక్కడికే సొంతం.
Similar News
News October 27, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. ప్రకాశం వాసులకు కలెక్టర్ సూచన.!

తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా వాసులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
➤అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దు.
➤అనవసర ప్రయాణాలు మానాలి.
➤పిల్లలను వాగుల వద్దకు వెళ్లకుండా చూడాలి.
➤ప్రమాదకర స్థాయిలో వాగులను దాటరాదు.
➤ఈత సరదా కోసం నీటిలో దిగరాదన్నారు.
➤శిధిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించరాదన్నారు.
➤2 రోజులకు అవసరమైన ఆహార పదార్థాలు సమకూర్చాలన్నారు.
➤అత్యవసరసాయానికి 108,104,102కు కాల్ చేయాలన్నారు.
News October 27, 2025
ప్రకాశం అధికారులను అలర్ట్ చేసిన సీఎం

మొంథా తుఫాన్ నేపథ్యంలో సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం గురించి, రెవెన్యూ సిబ్బంది తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ , ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు.
News October 27, 2025
శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే?

శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే ఉండనున్నట్లు సమాచారం. దీనిపై జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పునకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రేపు సీఎంకు నివేదిక పంపనుంది. అయితే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. మార్కాపురం-శ్రీశైలం 81KM, నంద్యాల-శ్రీశైలం 160KM. మార్కాపురానికి దగ్గరగా ఉందన్న కారణంతోనే కొందరు శ్రీశైలాన్ని ఆ జిల్లాలో కలపాలనే వినతులు సమర్పించారట.


