News December 20, 2024

నేడు, రేపు ఏజెన్సీలో డిప్యూటీ సీఎం పర్యటన

image

ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాల్లో రెండు రోజులు పర్యటన కోసం ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనకు ఘన స్వాగతం తెలిపారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో పవన్ బస చేశారు. శుక్రవారం పార్వతీపురం జిల్లాలో పర్యటించానున్నారు. ఎన్నికల ముందు ఏజెన్సీలో పర్యటించిన గిరిజనుల సమస్యలు తెలుసుకున్న ఆయన డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించనున్నారు.

Similar News

News December 10, 2025

విశాఖలో టెట్ పరీక్షకు తొలిరోజు 91.05% హాజరు

image

విశాఖలో బుధవారం జరిగిన టెట్ పరీక్షకు మొత్తం 2001 మంది అభ్యర్థులకు గానూ 1822 మంది (91.05%) హాజరయ్యారు. పరీక్షల సరళిని డీఈవో స్వయంగా 2 కేంద్రాల్లో తనిఖీ చేయగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం 5 కేంద్రాలను సందర్శించి పరిశీలించింది. ఉదయం 5 కేంద్రాల్లో, మధ్యాహ్నం ఒక కేంద్రంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు.

News December 10, 2025

ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి

image

ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి చెందింది. కంబాలకొండ నుంచి జింకలు తరచుగా రోడ్డుపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జింక రోడ్డుపైకి ఆకస్మికంగా రావడంతో, అటుగా వస్తున్న బస్సు ఢీకొంది. జింక అక్కడికక్కడే మృతి చెందింది. కంబాలకొండ అడవి నుంచి ఇలా రోడ్డెక్కిన జింకలు తరచుగా ప్రమాదాలకు గురై, తీవ్ర గాయాలు లేదా మరణం సంభవిస్తున్నాయి. మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

News December 10, 2025

విశాఖలో నేటి నుంచి ఎక్కడికక్కడ పనులు బంద్

image

జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్లు బుధవారం నుంచి పనులు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.18 నెలలు నుంచి కాంట్రాక్టర్లకు రూ.400 కోట్ల బకాయిలు ఉండగా బిల్లులు చెల్లించాలని పలు దఫాలుగా వినతులు ఇచ్చారు. మంగళవారం కమిషనర్‌కు నోటీసులు కూడా అందజేశారు. స్పందించకపోవడంతో నేటి నుంచి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోనూ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు.