News July 13, 2024
నేడు, రేపు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు

జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలో శని, ఆదివారం శ్రీకాకుళంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2024 పేరిట నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలో మొత్తం ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహించానున్నారు. అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17, అండర్-19 బాలికలకు, పురుషులు పోటీలు జరుగుతాయి.
Similar News
News September 16, 2025
SKLM: సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

రాష్ట్ర రాజధానిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నిర్వహించిన సమావేశంలో శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి పథకాలను సీఎం వివరిస్తూ, ఆయా జిల్లాలలో ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లాస్థాయి అధికారులు పనిచేయాలన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో కొన్నిటిని అమలు చేశామని తెలియజేశారు.
News September 16, 2025
ఇచ్ఛాపురం: అతిథి అధ్యాపక పోస్ట్కు దరఖాస్తులు ఆహ్వానం

ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒడియా అతిథి అధ్యాపక పోస్ట్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 22న ఉదయం 10 గం.లకు ఇంటర్వ్యూ ఉంటుందని, MA (ఒడియా)లో 50% మార్కులు, NET, Ph.D అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.
News September 16, 2025
సిక్కోలు జిల్లాలో డీఎస్సీకి ఎంతమంది ఎంపికయ్యారంటే ?

శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 543 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 535 మంది ఎంపికయ్యారు. ఇందులో ఎస్ఏ-391, ఎస్జీటీ-144 మంది ఎంపికయ్యారని అధికారులు వెల్లడించారు. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.