News October 25, 2024
నేడు, రేపు ANM అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

హైదరాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, గిరిజన వసతి గృహాల్లో ANM (ఔట్‌సోర్సింగ్) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈ నెల 25, 26 తేదీల్లో ఉ.10 నుంచి సా.5 గంటల వరకు గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో పరిశీలిస్తున్నట్టు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గతేడాది హైదరాబాద్ జిల్లాలోని గిరిజన వసతి గృహాల్లో ANM పోస్టులపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాజరు కావాలి.
Similar News
News February 23, 2026
గ్రేటర్‌లో కొత్త వెలుగుల జిలుగులు

మూడు ముక్కలైన గ్రేటర్ పాలనలో ఇప్పుడు కొత్త కాంతులు నిండనున్నాయి. EESL తప్పుకోవడంతో వీధి దీపాల నిర్వహణ భారమైనా ప్రభుత్వం పట్టు వదలకుండా CYB, మల్కాజిగిరి, GHMC పరిధిలో ఒకే తరహా వెలుగులు నింపేందుకు సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక జీవో విడుదల కానుంది. ఇకపై నగరం మొత్తం ఒకే రకమైన ప్రకటనల పాలసీ అమల్లోకి రానుంది. డిజిటల్ వెలుగులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సర్కారు అడుగులు వేస్తోంది.
News February 23, 2026
మురికి కూపంలో జవహర్‌నగర్.. డంపింగ్ యార్డు వేట!

గ్రేటర్‌లో మున్సిపాలిటీల విలీనం చివరకు జవహర్‌నగర్ పాలిట శాపంగా మారింది. సిటీ నుంచి రోజూ దాదాపు 8000 మెట్రిక్ టన్నుల చెత్త అక్కడ చేరుతుండగా.. కొత్త ప్రాంతాల నుంచి వస్తున్న 1500 టన్నుల అదనపు భారం ఆ ఊరిని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ఈ నరకం నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం వికేంద్రీకరణ బాట పట్టింది. శివారు ప్రాంతాల్లో కొత్త డంపింగ్ యార్డుల కోసం వేట మొదలుపెట్టింది.
News February 23, 2026
HYD: పోలీసులకు దొరికితే హెల్మెట్ ఫ్రీ.. Conditions Apply!

హెల్మెట్ లేకుండా పట్టుబడితే FINEతో పాటు పోలీసులు FREEగా హెల్మెట్ ఇస్తున్నారు. మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగం ‘హెల్మెట్ బ్యాంక్’ పేరుతో సంగీత్ చౌరస్తాలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బైకర్ వివరాలు నమోదు చేసి హెల్మెట్ తీసుకోవచ్చు. 24 గంటల్లోపు సొంతంగా హెల్మెట్ కొనుక్కుని పోలీసుల వద్ద తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి. చలాన్ల కన్నా ప్రాణ రక్షణే ముఖ్యం అని పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


