News November 18, 2024
నేడు లగాచర్లకు జాతీయ ST కమిషన్ మెంబర్

కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగాచర్లకు జాతీయ ST కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10గంటలకు లగాచర్లకు చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడి మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమావేశం అవుతారు. సాం. 4 గంటలకు సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులతో మాట్లాడి హైదరాబాద్ వెళ్తారు.
Similar News
News April 19, 2026
MBNR: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజల విలవిల

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.4, గండీడ్ మండలం సల్కర్ పేట 43.3, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 43.2, అడ్డాకుల 43.0, కోయిలకొండ మండలం పారుపల్లి 42.9, కౌకుంట్ల 42.7, మహబూబ్ నగర్ అర్బన్ 42.6, దేవరకద్ర 42.5 ఉష్ణోగ్రత నమోదయింది.
News April 19, 2026
MBNR: ప్రముఖ కవి కమలేకర్ దాగోజీరావు కన్నుమూత

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, పండితులు ఆచార్య కమలేకర్ దాగోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. భగీరథ కాలనీలోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. నేటి సాయంత్రం 4 గంటలకు వీరన్నపేట శివాలయం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల సాహితీలోకం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.
News April 18, 2026
జడ్చర్ల: సురేశ్ మృతిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిమ్లాగాని తండాకు చెందిన కాట్రావత్ సురేష్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతూ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ శనివారం పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


