News April 25, 2024

నేడు వరంగల్ ఎంపీ స్థానానికి ఏడుగురు నామినేషన్లు దాఖలు

image

15 ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి మొత్తం మంగళవారం ఏడుగురు నామినేషన్ వేశారని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మొత్తం 9 సెట్ల నామినేషన్ దాఖలు అయ్యాయని అన్నారు. వీరిలో పోగుల అశోక్ (IND) ఒక సెట్ నామినేషన్, మచ్చ దేవేందర్ (VCKP) 2 సెట్ల నామినేషన్, కుమ్మరి కన్నయ్య (IND) ఒక సెట్ నామినేషన్, కొంగర అనిల్ కుమార్ (IND) ఒక సెట్ నామినేషన్, చిలుముళ్ళ సుజాత (IND) ఒక సెట్ నామినేషన్ వేసారన్నారు.

Similar News

News January 25, 2025

ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు

image

వరంగల్‌లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారు శనివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.

News January 25, 2025

మాజీ కౌన్సిలర్ దంపతుల మీద దాడిని ఖండించిన పెద్ది

image

నర్సంపేట మాజీ కౌన్సిలర్ వెంకటమ్మ, స్వామి దంపతుల మీద దాడిని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రోడ్డు వెడల్పులో భాగంగా వెంకటమ్మ, స్వామి ఇంటి గోడను కూల్చే విషయంలో కుట్ర జరిగిందని ఆరోపించారు. దాడి జరిగే సమయంలో పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నిస్తే పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదని పెద్ది ఆరోపించారు. కాంగ్రెస్ వారికి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని పెద్ది ప్రశ్నించారు.

News January 24, 2025

వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం సైతం వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. 1048 రకం మిర్చి రూ.12,500, అకిరా బ్యాగడి మిర్చి రూ.13 వేలు పలికింది. అలాగే పాత తేజ మిర్చి ధర రూ.14,000, పాత 341 రకం మిర్చి ధర రూ.15,500, పాత వండర్ హాట్ మిర్చి రూ.14,000, 5531 మిర్చి రూ.12 వేల ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. సూక పల్లికాయ రూ.6,210, పచ్చిపల్లికాయ రూ.4 వేలు పలికాయి.