News August 20, 2024

నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్ ప్రారంభం

image

3 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున: ప్రారంభం కానుంది. వరుసగా రెండు వారాంతపు సెలవులు, నిన్న రాఖీ సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

Similar News

News December 14, 2025

వరంగల్: ఆకట్టుకుంటున్న గ్రీన్ పోలింగ్ కేంద్రాలు

image

వరంగల్ కలెక్టర్ సత్య శారద చొరవతో గీసుకొండ, నల్లబెల్లి మండలాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యావరణహితంగా తీర్చిదిద్దిన ఈ కేంద్రాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్లాస్టిక్ రహిత అలంకరణ, మొక్కలు, పూలతో కేంద్రాలను ఆకర్షణీయంగా రూపొందించడంతో పాటు ఓటర్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించారు.

News December 13, 2025

ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు: కలెక్టర్

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మొదటి విడత ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.