News September 23, 2024
నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్ ప్రారంభం

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
Similar News
News December 12, 2025
వరంగల్ తూర్పు కాంగ్రెస్లో కొత్త సమీకరణలు!

WGL తూర్పు కాంగ్రెస్లో రాజకీయ వేడి పెరుగుతోంది. జిల్లా అధ్యక్షుడి మార్పుతో సమీకరణాలు మారిపోతుండగా, కొండా దంపతుల అనుచరుడి ఇంట్లో నేతల మధ్య అంతర్గత చర్చలు జరిగాయి.సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో ఒక్కటైన తూర్పు నేతలు జిల్లా పార్టీ పదవులపై మంతనాలు జరిపినట్లు సమాచారం. నల్గొండ రమేశ్ ఇంట్లో మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సారయ్య భేటీ అయ్యారు. కీలక నేతలు త్వరలో రాష్ట్ర అధిష్టానాన్ని కలవనున్నట్లు తెలుస్తోంది.
News December 12, 2025
వరంగల్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

జిల్లాలో 91 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్గా 86.83 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
కట్ర్యాల: ఎన్నికల్లో రూపాయి ఖర్చు చేయకుండా బరిలో గెలిచిన సర్పంచ్

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి రాయపురం రమ్య 9 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. రూ.పది కూడా ఖర్చు చేయకుండా సర్పంచ్గా రమ్య ఎన్నికైంది. యువ విద్యావంతురాలైన రమ్యకు కట్ర్యాల ప్రజానికం పట్టం కట్టింది. రమ్య విజయం రాష్ట్ర రాజకీయాలకు రెఫరెండంగా నిలిచింది.


