News September 23, 2024
నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్ ప్రారంభం
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
Similar News
News October 7, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్..
> MHBD: దక్షిణాఫ్రికాలో మెరిసిన జిల్లా అమ్మాయి
> MLG: ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి
> WGL: కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు
> JN: ఒకే ఇంటిలో ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు
> HNK: జిల్లాలో ఘనంగా దాండియా వేడుకలు
> BHPL: పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది: MLA
> HNK: వృద్ధులను చిన్న పిల్లల్లా చూసుకోవాలి: ఎంపీ
News October 7, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> MHBD: పిడుగు పాటుకు గేదే మృతి.
> JN: మద్యం తాగి వాహనాలు నడుపరాదు
> MLG: సారా తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు
> WGL: పర్వతగిరిలో టపాసులు సీజ్
> HNK: పిడుగుపాటుకు ఇద్దరూ మృతి
> NSPT: కూలిన భారీ స్వాగత ఆర్చులు
> MLG: ట్రాక్టర్ బోల్తా పడి రైతూ మృతి
> WGL: తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి గాయాలు
News October 6, 2024
దక్షిణాఫ్రికాలో మెరిసిన మహబూబాబాద్ అమ్మాయి
దక్షిణాఫ్రికాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్‌లో ఇండియా తరఫున 76 కేజీల విభాగంలో మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలానికి చెందిన సుకన్య రజతం సాధించింది. జాతీయ స్థాయిలో పతకం గెలవడంతో జిల్లాలో ప్రజలు అనందం వ్యక్తం చేస్తున్నారు. తన సొంత గ్రామంలో సంబురాలు అంబారాన్నంటాయి. అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని తెలుగునాట ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.