News November 18, 2024

నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్ పున: ప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శుక్రవారం కార్తీక పౌర్ణమి, నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో సోమవారం ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకువచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

Similar News

News September 17, 2025

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిపాలన భవనం ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, సురేశ్ కుమార్, ఏసీపీలు, ఆర్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలతో పాటు వివిధ విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

News September 17, 2025

వరంగల్ జిల్లాలో వర్షపాతం వివరాలు

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 128.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖిల్లా వరంగల్ మండలంలో అత్యధికంగా 27.8 మి.మీ వర్షం పడగా, గీసుగొండ 18, వరంగల్ 15.8 వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 9.9 మి.మీగా నమోదైంది.

News September 17, 2025

వరంగల్: ఐక్యతతోనే విజయం సాధ్యం

image

ఐక్యతతోనే విజయం సాధ్యం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ గడ్డ ఎల్లప్పుడూ పోరాటపటిమను ప్రదర్శిస్తోందని వరంగల్ పోలీసులు పేర్కొన్నారు. ఐక్యతతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్న సందేశాన్ని కొనసాగిస్తూ విజయపథంలో ముందుకు సాగుదాం అంటూ తమ అధికారిక X ఖాతా ద్వారా పిలుపునిచ్చారు.