News February 27, 2026
నేడు వరంగల్ నిట్‌కు హీరో నిఖిల్

అర్జున్ సురవరం, కేశవ, కిరాక్ పార్టీ, స్పై, స్వామిరారా తదితర చిత్రాల్లో నటించిన హీరో నిఖిల్ శుక్రవారం ఓరుగల్లుకు రానున్నారు. వరంగల్ నిట్‌లో జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిట్ ఓల్డ్ ఆడిటోరియంలో విద్యార్థులతో మమేకమై చర్చాగోష్ఠి నిర్వహిస్తారు. ఇందుకోసం ఆడిటోరియంలో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
Similar News
News April 13, 2026
భద్రాద్రి: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఇంటర్మీడియట్ ఫలితాల్లో భద్రాద్రి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. బాలికలు పైచేయి సాధించి మేటిగా నిలిచారు. ప్రథమ సంవత్సరంలో 63.49%, ద్వితీయ సంవత్సరంలో 77.71% ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రస్థాయిలో 9వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒకేషనల్ విభాగంలో 78.19% ఫలితాలు నమోదయ్యాయి. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం మెరుగుపడటంతో పాటు, విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో మెరవడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
News April 13, 2026
అన్నదాతకు ‘ఉల్లి’పోటు.. భారీగా పడిపోయిన ధర

TG: ఉల్లి ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. సంగారెడ్డి(D) సదాశివపేట మార్కెట్‌లో గతేడాది APRలో రూ.2,300 పలికిన క్వింటాల్ ఉల్లి తాజాగా రూ.504కు పడిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. JAN-MAY మధ్య భారీగా దిగుబడి వస్తుంది. దీంతో ధరలు పతనమయ్యాయి. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వ్యాపారులు రూ.100కు 5-8 కిలోల వరకు ఉల్లి విక్రయిస్తున్నారు.
News April 13, 2026
భూపాలపల్లి: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఇంటర్ ఫలితాల్లో భూపాలపల్లి జిల్లాలో బాలికలు ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే ఈసారి ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. 34 కళాశాలల్లోని ఫస్ట్ ఇయర్‌లో 1734 విద్యార్థులకు 1259 మంది, సెకండ్ ఇయర్‌లో 1740 మందికి 1439 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో గతేడాది 56% రాగా ఈ ఏడాది 73.03 % , సెకండ్ ఇయర్‌లో గత ఏడాది 72.07 శాతం, ఈఏడాది 82.34% మంది విద్యార్థులు పాసయ్యారు.


